BRS MLAs | రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాప్‌ల్లో దొరుకుతుందా?, కాంగ్రెస్ వచ్చింది.. యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్లకార్డులతో శాసన సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నేను మాట్లాడిన తర్వాతనే మీకు సరెండర్ లీవ్‌ల డబ్బులు వచ్చాయి.. ఇప్పుడు యూరియా మీద కూడా రైతుల పక్షాన మాట్లాడితేనే యూరియా వస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో వెంటనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం పెట్టారు.
యూరియా కొరతకు నిరసనగా అసెంబ్లీలో ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
షాప్‌లలో లేని యూరియా యాప్‌లలో ఉంటుందా అంటూ ప్లకార్డులు ప్రదర్శన
ప్లకార్డులు లోపలికి అనుమతి ఇవ్వని పోలీసులు
పోలీసులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాగ్వాదం pic.twitter.com/o1KMLvYD3J
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2026