BRS MLAs | హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన వ్యక్తం చేశారు. యూరియా సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు చేశారు. పండగపూట కూడా రైతన్నలను రోడ్లపై నిలబెట్టింది ఈ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. “గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా” అంటూ నినదించారు. రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు. రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. “రేవంత్ దోషం – రైతన్నకు మోసం” అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
గణపతి బప్పా మోరియా…
కావాలయ్య యూరియా!@KTRBRS 🔥 pic.twitter.com/fvw2lgRru5— BRS Party (@BRSparty) August 30, 2025