BRS | అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఉదయం శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సచివాలయంలో కమీషన్లపై, కాంట్రాక్టర్ల ధర్నా గురించి కేటీఆర్ ప్రస్తావించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. భట్టి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. వద్దురా నాయనా 20 పర్సంట్ పాలన అంటూ.. అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు. ఇది పర్సంటేజ్‌ల పాలన అంటూ నినాదాలు చేశారు. ఇదేమి ప్రభుత్వం.. 20 శాతం, 30 శాతం పర్సంటేజీల ప్రభుత్వం అని కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు.
వద్దురా నాయనా 20 % కమీషన్ పాలన
అంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం దగ్గర బైఠాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. pic.twitter.com/0UBVJ7f5wV— BRS Party (@BRSparty) March 26, 2025