Srinivas Goud | దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి.. సత్తా చూపుతాం : శ్రీనివాస్ గౌడ్
Srinivas Goud | బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి.. ఆ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Srinivas Goud | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి.. ఆ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్కు గొప్ప ఉద్యమ చరిత్ర ఉందని, త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పుట్టిందన్నారు. ఉద్యమంలో భాగంగా అనేక సార్లు రాజీనామాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అన్నారు. పార్టీ మారేవారంత తొందర పడుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే కాదు ఇంకా 14 పార్టీలకు సీట్లు రాలేదన్నారు. మోదీ కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీద పార్లమెంటు ఎన్నికలు జరిగాయని, రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఈ విషయాలు గమనిస్తారన్నారు. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఫలితాలు పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లా ఉండవన్నారు. ప్రజలు తెలివైన వారని, వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారన్నార. బీఆర్ఎస్కు 60 లక్షల మంది సభ్యత్వం ఉందని, ఆషామాషీగా తుడిచి పెట్టలేరన్నారు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ను కాపాడుకోవాలన్నారు. దేశంలో అభివృద్ధికి తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు ఇష్టం లేకుంటే పోండి కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించవద్దని ఆయన సూచించారు. పార్టీ ఉండదు అని శాపనార్ధాలు పెట్టడం మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదొడుకులు కొత్తకాదని, ఒక సారి ఓడిపోగానే పార్టీల పని అయిపోతుందా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ను ఉద్యమంలో కూడా చంపాలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారన్నారు. ఇపుడు కూడా బీఆర్ఎస్ ను లేకుండా చేయాలనే కుట్రలు సఫలం కావన్నారు. ఓడిపోయినంత మాత్రాన ఎదో జరుగుతుందని ఊహించుకోవడం సరికాదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
MLA Prakash Goud | కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

