MLA Sabitha | చేవెళ్ల టౌన్, ఏప్రిల్ 22 : ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఆయన అడుగు జాడలో నడవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా చేవెళ్ల మున్సిపాలిటి కేంద్రంలోని అయన విగ్రహానికి కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్ పట్లోళ్ల కృష్ణారెడ్డితో కలిసి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూలమాలళు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి అందరి నుండి దూరమై 25 ఏళ్లు కావొస్తున్న ఇంకా ప్రజల గెండెల్లో ఉన్నాడని తెలిపారు. ఇంద్రారెడ్డి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పేదల అభివృద్ధికి కృషి చేశారన్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజల గుండెల్లో ఇంద్రారెడ్డి కుటుంబం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఇంద్రన్న అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అశయ సాధనలో ముందుకెళ్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, సీనీయర్ నాయకులు కార్తీక్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ బాల్ రాజ్, మాజీ జెడ్పీటీసీ కృష్ణా రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ప్రసాద్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, చేవెళ్ల నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వంగ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు నరహరిరెడ్డి, ప్రభాకర్, శివారెడ్డి, హన్మంత్ రెడ్డి, జహాంగీర్, మల్లారెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ చారి, చేవెళ్ల మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మెన్లు గిరిధర్ రెడ్డి, నర్సిములు, మాజీ డైరెక్టర్లు తెలుగు వెంకటేష్, మహేశ్, సాయినాథ్, గుడి మల్కార్ డైరెక్టర్లు మంగలి యాదగిరి, నాయకులు గుడెన్నోళ్ల మాణీక్యం, మహేందర్ రెడ్డి,అర్థశేఖర్ రెడ్డి, కృష్ణయ్య, మాదవ గౌడ్, శ్రీనివాస్, గుడిపల్లి శేఖర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఎల్లయ్య, రాంప్రసాద్, వెంకటేష్, గని, తదితరులు ఉన్నారు.