Sabitha Indra Reddy | హైదరాబాద్ : తెలంగాణ రైతాంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. యూరియా కోసం మహిళా రైతులు పడుతున్న తిప్పలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కనిపిస్తుందా.. వినిపిస్తుందా.. గౌరవ ముఖ్యమంత్రి గారూ.. మీ పాలనలో అందరీలాగే మహిళ రైతులకు కూడా ఇబ్బందులేనా..? ఇదిగో జర చూడండి అని యూరియా కోసం మహిళలు పడుతున్న ఇబ్బందులను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సబితా ఇంద్రారెడ్డి.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. వారి గొడవకు కారణం మీరు మీ ప్రభుత్వం కాదా? ఒక్క యూరియా బస్తా కోసం నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న మహిళ రైతుల ఆవేదన మీకు కనిపిస్తాలేదా అని రేవంత్‌ను సబిత నిలదీశారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలోని సొసైటీ గోడౌన్ వద్ద యూరియా కోసం రాత్రినుండే చెప్పులు లైన్లో పెట్టి, గోడౌన్ దగ్గర నిద్రిస్తున్న మహిళల గోస మీకు పట్టదా? సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో యూరియా కోసం ఉదయం నుండి లైన్లో నిలబడి స్పృహ తప్పి పడిపోయిన మహిళా రైతు గురుంచి మీకు తెలుసా..? యాదాద్రి జిల్లా అడ్డగూడురులో హృదయ విదారక దృశ్యాలు… ఇవి మనసు ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తాయి.. నిద్ర పోతున్న ఈ ప్రభుత్వానికి కనీస కనికరం లేకపాయే. ఆకలికి ఏడుస్తున్న తన చంటి బిడ్డకు పాలు ఇస్తూ యూరియా కోసం క్యూలైన్లో వేచి ఉన్న తల్లి. తన ముగ్గురు పిల్లలతో క్యూలైన్లో ఉన్న మరో తల్లి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో యూరియా కోసం వ్యవసాయ కేంద్రం గేట్, గోడలు దూకి పరుగులు తీసిన మహిళా రైతులు.. వారి కష్టం తీర్చే తీరిక మీకు లేదా? సినిమాలో కూడా కనిపించని స్కిట్లు.. నేడు రేవంత్ రెడ్డి పాలనలో… ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తానన్న మాటలు దేవుడెరుగు… ఒక్క యూరియా బస్తా అయిన ఇవ్వండి సారు. బిందెడు నీటి కోసం మహిళలు కష్టాలు పడుతూ, అవమానాలు ఎదుర్కొనటం చూసి నాడు చలించి మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందించి, ఆడబిడ్డల గౌరవం పెంచిన కేసీఆర్ పాలన ఎక్కడ.. రాత్రి పగలు అనక యూరియా బస్తాల కోసం మహిళలు పడిగాపులు కాస్తున్న నేటి మీ పాలనా. ఇదేనా మీ ప్రజా పాలన?ఎప్పటికి క్షమించదు మహిళ లోకం అని సబితా ఇంద్రారెడ్డి తేల్చిచెఊప్పారు.
కనిపిస్తుందా…..వినిపిస్తుందా……గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారు…మహిళ రైతుల యూరియా తిప్పలు…మీ పాలనలో అందరీలాగే మహిళ రైతులకు కూడా ఇబ్బందులేనా ?
ఇదిగో జర చూడండి
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న… pic.twitter.com/t9WwbUHD3l
— Sabitha Reddy (@BrsSabithaIndra) September 5, 2025