KTR | హైదరాబాద్ : ఎవరు ఏమనుకున్నా సరే.. తెలంగాణ జాతిపిత కచ్చితంగా కేసీఆరే.. బూతుపిత రేవంత్ రెడ్డినే అవుతారు అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి బూతుపితగానే మిగిలిపోతారు అని కేటీఆర్ విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ముఖ్యమంత్రికి ఎవరో ఏకే47 గురించి చెప్పారు. ఎవరో కాల్చి చంపారంట..? ఏకే47 తో పాటు తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెల్వది. తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకు తుపాకి తీసుకుపోయిన రైఫిల్ రెడ్డి ఆయన. అసలు ఎవరు ఎవర్ని చంపి అధికారం లాక్కున్నారు..? పాపం పాత కాంగ్రెసోళ్లను అందర్నీ ఖతం చేసి ఆయన పదవి లాక్కుని ఇవాళ మమల్ని అంటే ఎలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ రైజింగ్ అంట.. అట్టర్ ప్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు. ఏడాదిలో ఆరు గ్యారెంటీలు, తులం బంగారం, రుణమాఫీ, రైతుబంధు ఇచ్చారా..? అప్పుల్లో, అబద్దాల్లో, క్రైమ్ రేట్లో, నేతన్నలు, అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ రైజింగ్ అని కేటీఆర్ పేర్కొన్నారు.