KTR | హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రమాద ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
నాలుగు రోజులు క్రితమే మొదలయిన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదాన్ని దాచిపెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వారి ఆలోచనలకు అద్దం పడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రమాదం పొద్దున్న 8:30 గంటలకు జరిగితే మధ్యాహ్నం వరకు ప్రభుత్వంలో చలనం లేకపోవడం అత్యంత దురదృష్టకరం. ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో కూడా తెలియని స్థితిలో యంత్రాంగం ఉందని కేటీఆర్ తెలిపారు.
సీపేజ్ వచ్చింది, అందుకే కూలింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. సీపేజ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎందుకు పాటించాలేదు? సుంకిశాల ప్రమాదంలా దాచిపెట్టే ప్రయత్నం చెయ్యకుండా.. ఇప్పటికైనా ఎంతమంది కార్మికులు లోపల ఇరుక్కున్నారు, వారిని రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో వెంటనే చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం.. రేవంత్ చేతగాని తనానికి నిదర్శనం : హరీశ్‌రావు
KTR | రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అట : కేటీఆర్
KTR | కాంగ్రెస్ పాలనపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్