KP Vivekanand | హైదరాబాద్ : గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులను, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తూ ఎమ్మెల్సీ కవిత చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని గుర్తించి, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి ఎవరినైనా ఉపేక్షించేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం. కేసీఆర్ గతంలోనే చెప్పారు తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని చెప్పారు. కన్నకూతురు కంటే కూడా కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు, ఈరోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కేపీ వివేకానంద్ అన్నారు.