MLA jagadish reddy | హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీశ్ రెడ్డి సభకు హాజరు కాలేరు. జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రతిపాదన చేశారు. సభ నుంచి వెంటనే వెళ్లాలని జగదీశ్ రెడ్డిని స్పీకర్ ఆదేశించారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్పై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.
బ్రేకింగ్ న్యూస్
అసెంబ్లీలో తన పై అనుచిత వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి సస్పెండ్ చేసిన స్పీకర్ https://t.co/SpxCC9gavq pic.twitter.com/PvHPNL0lea
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025