నేరేడుచర్ల, మార్చి 26 : కేటీఆర్, క్రిశాంక్, కొణతం దిలీప్‌పై పోలీసులు పెట్టినవి చిల్లర కేసులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బుధవారం అనంతరం మీడియా తో మాట్లాడారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు ఆడుతున్నదని మండిపడ్డారు. హామీలను అమ లు చేయలేక, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నదని దుయ్యబట్టారు. నకిరేకల్‌లో జరిగిన పదోతరగతి పేపర్ లీకేజీ కేసులో నిందితులను పట్టుకోవడం కంటే, బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయటానికి శ్రద్ధ ఉందని మండిపడ్డారు. కేటీఆర్‌ను తొందరగా అరెస్టు చేయాలనే భ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మా జీ ఎంపీ బడుగుల లింగయ్య యా దవ్, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త ఒం టెద్దు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.