MLA Jagadish Reddy | హైదరాబాద్ : మూడేళ్ల తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నాయకులను నేనే సర్కస్ ఆట ఆడిస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్తాం బిడ్డా సర్కస్ ఆట అని ఘాటుగా వ్యాఖ్యానించారు జగదీశ్ రెడ్డి.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై తుంగతుర్తి నియోజకవర్గంలోని పాటిమట్ల గ్రామంలోని లక్ష్మీనరసింహ స్వామి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మోత్కూరు, అడ్డగూడూరు మండలాల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మోత్కూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ అమీర్, మహేశ్వరం హనుమంతు, వెంకట్‌తో పాటు పలువురు నాయకులకు జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి ప్రసంగించారు.
2018లో నల్గొండ నాయకులను ఓడగొట్టే బాధ్యత తీసుకున్నా, అందరిని ఓడించిన.. ఇప్పుడు వీళ్లందరినీ సర్కస్ ఆడించే బాధ్యత తీసుకుంటా, వీళ్ళతో ఆడిస్తా. కాంగ్రెస్ నాయకుల ఉడతా ఊపులకు మేము భయపడం. కేటీఆర్ రేవంత్ రెడ్డిని హౌలే అంటే బండి సంజయ్ ఒకటే ఏడుస్తున్నాడు. బండి సంజయ్‌కి ఏం సంబంధం అసలు? కాంగ్రెస్ మంత్రులు ఏమో మేము అనలేకపోయినా కేటీఆర్ అన్నాడు అని సంతోష పడుతుంటే.. బీజేపీ మంత్రులు ఏమో ఏడుస్తున్నారు. రేవంత్ రెడ్డిని హౌలే అంటేనే మీకు అంత కోపం వస్తుంది కదా.. అలాంటిది తెలంగాణ కోసం చావు అంచులదాకా వెళ్లిన కేసీఆర్‌ని లాగులో తొండలు వేస్తా, గుడ్లు పీకి గోలీలు ఆడుతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా, ఉరి తీస్తా, పెట్రోల్ పోసి సంపుతా అన్నప్పుడు కేటీఆర్ హౌలే అని అంటే తప్పేముంది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
మోదీ తెలంగాణలో ఈడీ రైడ్స్ కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద చేయిస్తున్నాడు. తమిళనాడులో అక్కడి స్టాలిన్ ప్రభుత్వం మీద ఈడీ రైడ్స్ అవుతున్నాయి.. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని మోదీ కాపాడుతున్నాడు. మోదీ శత్రుత్వం చూపించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద చూపించాలి కానీ ఇక్కడ వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్నాడు అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
నల్గొండ కాంగ్రెస్ నాయకులను మూడేళ్ల తర్వాత నేనే సర్కస్ ఆట ఆడిస్తా
ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్తాం బిడ్డా సర్కస్ ఆట
2018లో నల్గొండ నాయకులను ఓడగొట్టే బాధ్యత తీసుకున్నా, అందరిని ఓడించిన.. ఇప్పుడు వీళ్లందరినీ సర్కస్ ఆడించే బాధ్యత తీసుకుంటా, వీళ్ళతో ఆడిస్తా… pic.twitter.com/22uUkukiYf
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2025