Jagadish Reddy | సూర్యాపేట : దసరా పండుగ వేళ మతసామరస్యం వెల్లివిరిసింది. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సామూహిక విందు ఇచ్చారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిఏడాది మాదిరిగా క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట ముస్లిం, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేశారు జగదీశ్ రెడ్డి.
ఆత్మీయ సమ్మేళనంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి పదేండ్ల పాలనలో జరిగిన సూర్యాపేట అభివృద్ధి, ప్రశాంత వాతావరణం, పెరిగిన ఐక్యతను కొనియాడి.. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి, జగదీశ్ రెడ్డిని ఆశీర్వదించారు. ఇక సామూహిక విందుకు హాజరైన ప్రతి ఒక్కరిని జగదీశ్ రెడ్డి ఆప్యాయంగా పలుకరించి, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
వెల్లివిరిసిన మతసామరస్యం
సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సోదరులకు సామూహిక విందు ఇచ్చిన జగదీష్ రెడ్డి
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతిఏడాది మాదిరిగా క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట ముస్లిమ్, క్రైస్తవ సోదరులకు సామూహిక విందు ఏర్పాటు చేసిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే… pic.twitter.com/xxjVjxlvmP
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2024
ఇవి కూడా చదవండి..
America | సిరియాపై విరుచుకుపడుతున్న అమెరికా.. ఐసీస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా బాంబు దాడులు
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో బావి నీళ్లు తాగిన 30 మందికి అస్వస్థత