Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ సాగునీనీటి రంగ నిపుణులు, ‘నీళ్లు.. నిజాలు’తో తెలంగాణను జాగృతం చేసిన మహనీయులు, సమైక్య పాలకుల జల దోపిడీని చివరి శ్వాస వరకు అడ్డుకున్న ఆర్. విద్యాసాగర్ రావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఘన నివాళులర్పించారు.
సాగునీటి రంగ నిపుణులు, నీళ్ల గురించిన నిజాలను మనకు తెలియజెప్పిన నీటి పారుదల నిపుణులు, జీవితపు చివరి క్షణం వరకూ తెలంగాణ బాగు కొరకు తపించిన మహామనిషి ఆర్. విద్యాసాగర్ రావు అని హరీశ్‌రావు కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా వారి సేవలను హరీశ్‌రావు స్మరించుకున్నారు.