Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా అడిగినందుకు రైతు చెంప ఛెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
ఈ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు రెండే.. మూటలు మోయడం.. మాటలు మార్చడం అని హరీశ్‌రావు విమర్శించారు. యూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదన్నారు.. ఏఐతో ఫేక్ ఫోటోలతో ప్రచారం అన్నారు. రాష్ట్రంలో రైతుల క్యూలైన్లే లేవన్నారు. తరువాత.. క్యూలో ఉన్నవాళ్లు రైతులే కాదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే లైన్లో నిల్చున్నారన్నారు. చివరికి యూరియా కొరత నిజమేనని ఒప్పుకున్నారు కానీ కారణం మాది కాదు కేంద్రంలోని బీజేపీదన్నారు. రష్యా ఉక్రెయిన్ వార్ వల్లే ఈ సంక్షోభం అన్నారు. యుద్ధం వల్ల కాదు.. కాంగ్రెస్ సిద్ధంగా లేకపోవడం వల్ల యూరియా సంక్షోభం అని రైతులకు అర్థమైపోయింది. రైతులపై చేయి చేసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా చేయడంలో విఫలమైన ఈ సర్కారు యావత్ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
యూరియా అడిగినందుకు రైతు చెంప చెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన?
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా @revanth_anumula ?
ఈ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు రెండే..
మూటలు మోయడం.. మాటలు మార్చడంయూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారు.
రాష్ట్రంలో యూరియా కొరతే లేదన్నారు..… pic.twitter.com/NoUKaxPs1A
— Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2025