Harish Rao | హైదరాబాద్ : గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ – బీజేపీకి మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలైంది. బీజేపీకి ఒక న్యాయం.? బీఆర్ఎస్కు ఒక న్యాయమా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గంటల పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి నిరసన తెలియజేస్తుంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్టు చేయడం దుర్మార్గం. వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయాలు పక్కనబెట్టి ముందు విద్యార్థుల సమస్య పరిష్కరించడంపై దృష్టి పెట్టండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆపండని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | పేపర్ లీకులు తప్ప.. బండి సంజయ్‌కు గ్రూప్-1 గురించి ఏం తెలుసు..! కేటీఆర్ ఎద్దేవా
KTR | గ్రూప్-1 అభ్యర్థులను పశువుల మాదిరిగా చూడడం దారుణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్