Harish Rao | హైదరాబాద్ : పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ ఘటనలో తొర్రూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఆయన తెలిపారు.
ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోవాలని, విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని డిమాండ్ చేస్తున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించినందుకు మాలోత్ సురేశ్ కుమార్‌ను తొర్రూర్ ఎస్ఐ దారుణంగా కొట్టినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పీఏ, నాయకులకు పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలిస్తూ, వాళ్లు నవ్వుతుంటే తన కొడుకును ఇష్టమున్నట్లు తిడుతూ చిత్రహింసలు పెట్టి కొట్టారని సురేశ్ కుమార్ తల్లి వాపోయింది. తన కుమారుడికి ఏమైనా అయితే ఎస్‌ఐదే బాధ్యత అని.. తొర్రూర్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని బాధితుడి తల్లి డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు రెచ్చిపోయిన పోలీసులు
పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించినందుకు యువకుడిని దారుణంగా కొట్టిన తొర్రూర్ ఎస్ఐ
పీఏ, నాయకులకు పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలిస్తూ, వాళ్లు నవ్వుతుంటే తన కొడుకును ఇష్టమున్నట్లు తిడుతూ చిత్రహింసలు… pic.twitter.com/kRe3DEFAtQ
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఓయూలో పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులను కలిసిన కేటీఆర్
Telangana Assembly | 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!
KTR | సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ