TGSPDCL | 4 కోట్ల ప్రజల ఆస్తిని అదానీకి, అంబానీకి ఇస్తామంటే చూస్తూ ఊరుకోం.. కాంగ్రెస్ సర్కార్‌కు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
TGSPDCL | ప్రజల ఆస్తి అయినా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలను ప్రయివేటు పరం చేస్తామనడం దారుణం అని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా మండిపడింది. విద్యుత్ సంస్థలను అదానీకి, అంబానీకి కట్టబెడుతామంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని 55 వేల మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోరని ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది.
TGSPDCL | హైదరాబాద్ : ప్రజల ఆస్తి అయినా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలను ప్రయివేటు పరం చేస్తామనడం దారుణం అని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా మండిపడింది. విద్యుత్ సంస్థలను అదానీకి, అంబానీకి కట్టబెడుతామంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని 55 వేల మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోరని ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో ఉన్న సీఈవోలకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి..? దావోస్‌లో, ఢిల్లీలో జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదేదో రహస్య డాక్యుమెంట్ కాదు. ఇది పబ్లిక్ ప్రాపర్టీ. ఎస్సీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్కో అయినా.. ప్రజల ఆస్తి. నాలుగు కోట్ల మంది కట్టిన కరెంట్ బిల్లులతో సంపాదించిన ఆస్తులు ఇవి. అలాంటి ఆస్తులను అదానీకి, అంబానీకి, ఇంకొకరికి ఇస్తామంటే.. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోని 55 వేల మంది ఉద్యోగులు చూస్తూ ఊరుకోరని ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం అని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏది చెబితే అది చేయడానికి మా ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారు. మాకు రక్షణ కల్పించండి.. ఎంత పెద్ద వ్యక్తి ఇంటికి అయినా కరెంట్ కట్ చేసే సత్తా మా కార్మికులకు ఉంది. మీకు రాజకీయ అనుబంధాలు ఉంటే ఉండనివ్వండి. కానీ ప్రభుత్వ రంగ సంస్థ అయినా ఎస్పీడీసీఎల్ను, ఎన్పీడీసీఎల్‌ను ఎందుకు ప్రయివేటీకరణ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఈ హక్కు మీకు ఎవరు ఇచ్చారు..? ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా..? అని ప్రశ్నించారు.
ఇంత జరుగుతున్నా యాజమాన్యం ఏం చేస్తున్నట్టు..? చిన్న పొరపాటు జరిగితేనే మా ఉద్యోగులను మెమోలు జారీ చేస్తారు కదా..? మరి సంవత్సరానికి రూ. 500 కోట్ల నష్టం జరుగుతుందంటే.. మీరేం చేశారు. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది. వీటిపై ఎవరూ సమాధానం చెప్పరు. సౌత్ సర్కిల్ మీద దొంగ కరెంట్ అరికట్టడానికి, బిల్లులు వసూలు చేయడానికి మీరు ఒక ప్రణాళిక రూపొందించండి. మీరు రూపొందించే ప్రణాళికలో విద్యుత్ శాఖ మంత్రిని, ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలతో పాటు రిజిస్టర్డ్ యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులను, ఇంజినీర్లను భాగస్వామ్యం చేస్తూ ఒక కమిటీ వేయండి. సమగ్రంగా ఒక రిపోర్టు తయారు చేసి సమస్యను పరిష్కరించండి అని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది.
ఎస్పీడిసిఎల్ ప్రధాన కార్యాలయం ముందు విద్యుత్ ఉద్యోగుల ధర్నా.
4 కోట్ల ప్రజల ఆస్తిని అదానీకి, అంబానీకి ఇస్తాం అంటే చూస్తూ ఊరుకోం
ముఖ్యమంత్రికి ఆదాని కంపెనీకి జరిగిన ఒప్పందం ఏంటి? దావోస్ లో, ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రి, అదాని కంపెనీ ప్రతినిధుల మధ్య భేటి రహస్యం ఒప్పందాలు బయట… pic.twitter.com/peYQUAnhSn
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
ఇవి కూడా చదవండి..
KTR | సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
KTR | తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆశిస్తున్నా.. కేటీఆర్ ట్వీట్
KTR | ఈ మహా నగరానికి ఏమైంది..?.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్
RS Praveen Kumar | కాంగీయుల పాలనను ప్రజలే మట్టుబెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి : ఆర్ఎస్పీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

