KTR | ఓయూలో పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులను కలిసిన కేటీఆర్
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నిన్న పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులను నందినగర్‌లో కలిశారు. వారి పోరాట పటిమను ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట పటిమను అనేక సందర్భాల్లో చూపించారు.
KTR | హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్వీ నాయకులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్వీ నాయకులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఇక వారం పది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న నిరుద్యోగుల ఆందోళనల్లోనూ బీఆర్ఎస్వీ నాయకులు పాలుపంచుకున్నారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరేవర్చాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేశారు. ఇక డీఎస్సీని వాయిదా వేయాలంటూ గత వారం రోజుల నుంచి డీఎస్సీ అభ్యర్థులు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమిస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు నిన్న శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు.
అయితే బీఆర్ఎస్వీ నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో విద్యార్థి నాయకులు గాయపడ్డారు. పోలీసుల తీరును బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. నిన్న పోలీసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులను నందినగర్‌లో కలిశారు. వారి పోరాట పటిమను ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ పోరాట పటిమను అనేక సందర్భాల్లో చూపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినప్పుడు, గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, డీఎస్సీ వాయిదా వేయాలని మీరు నిరసనలు చేపట్టారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉండాలని కేటీఆర్ సూచించారు. ఎల్లప్పుడూ పార్టీ అగ్ర నాయకత్వం బీఆర్ఎస్వీ నాయకులకు అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
నిన్న పోలిసుల దాడిలో గాయపడ్డ బీఆర్ఎస్వీ నాయకులను కలిసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/JcNeikkjuc pic.twitter.com/yCqnkU9ZYi
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2024
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..!
KTR | సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి.. బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

