హైదరాబాద్, జులై 13(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా, అరెకపూడి గాంధీ చేరికతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది.
ఇక రాత్రి 8.30 ప్రాంతంలో ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సీఎం నివాసానికి వెళ్లడం రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లిపోయినా..ఆయన చేరికకూ ముహూర్తం కుదిరినట్టు జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి.