సూర్యాపేట : బీఆర్ఎస్తోనే మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్‌రెడ్డి(Minister Jagadish reddy) అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17 వ వార్డు అంబేద్కర్ నగర్‌కు చెందిన మైనార్టీ నాయకులు(minorities leaders) ఖాదర్‌తో పాటు మరికొందరూ వార్డ్ కౌన్సిలర్ భరత్ మహజన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్(BRS)లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. మైనార్టీ నాయకులు మాట్లాడుతూ సొంత గూటికి చేరుకున్నందుకు తమకు ఆనందంగా ఉందని వెల్లడించారు.గతం లో అవగాహనరాహిత్యం తో పార్టీ వీడిన నేతలంతా మంత్రి జగదీశ్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి,సంక్షేమానికి ఆకర్షితులై తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నామని వెల్లడించారు.
సూర్యాపేట లో ప్రత్యేకించి ముస్లింలకు షాదీఖానా, కబరిస్తాన్, కమ్యూనిటీ హాల్స్, పాత మసీదుల పునరుద్ధీకరణ వంటి అభివృద్ధి పనుల చేపట్టారని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీసర వేణు గోపాల్ రెడ్డి, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.