కరీంనగర్ : మాజీ మంత్రి, కరీంనగర్(Karimnagar) ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను(Gangula Kamalakar) మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఎమ్మెల్యే గంగుల మాతృమూర్తి గంగుల లక్ష్మీ నర్సమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో గురువారం కరీంనగర్లోని గంగుల కమలాకర్ నివాసానికి వెళ్లి లక్ష్మీ నర్సమ్మ(85) చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగుల లక్ష్మీ నర్సమ్మ కరీంనగర్లోని గంగుల నివాసంలో మంగళవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.
నివాళులు అర్పించిన వారిలో మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, జోగు రామన్న, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్, ఎన్ భాస్కర్ రా, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, కోరుకంటి చందర, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ విజయ, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్, తదితరులు ఉన్నారు.