హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టబోయే ఓటర్ల జాబితా సవరణను (SIR)ను పకడ్బందీగా చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ( Vinod Kumar ) , రావుల చంద్రశేఖర్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్పై తమకు ఉన్న అనుమానాలను సీఈవోకు వివరించామని వెల్లడించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతా ఓటర్లలో నెలకొన్న ఆందోళనలను దూరం చేయాలని కోరారు. బూత్ లెవల్ అధికారులే కాకుండా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా యాక్టివ్ గా ఉండాలని సూచించారని ఆయన వివరించారు. నిన్న జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించి, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని చెప్పారని గుర్తు చేశారు.