రాష్ట్ర కాంగ్రెస్‌కు బీజేపీ (BJP) రక్షణ కవచమంటూ బీఆర్ఎస్ (BRS) ముఖ్యనేతలు చెప్తున్నదానికి ఈ చిత్రాలు మరో సాక్ష్యంగా నిలిచాయి. గురువారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఎదురుపడి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు.

పరస్పర విరుద్ధ భావాలు కలిగిన కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో కొట్లాడుకుంటూ రాష్ట్రంలో చెట్టాపట్టాలేసుకొని తిరగడంపై ఇరు పార్టీల శ్రేణులు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి.