వెల్దండ, నవంబర్ 27 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వెలువడిన నోటిఫికేషన్లో నాగర్కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్లారు. వెల్దండ మండలం తిమ్మినోనిపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు గండికోట రాజు, కాన్గుల జోగ య్య గురువారం హైకోర్టును ఆశ్రయించారు.
వెల్దండ మండలంతోపాటు జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యు ల్లో బీసీలకు చాలా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి బీసీలకు న్యాయం చేయాలని, అప్పటివరకు ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు.