BRS | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు భేటీ అయ్యారు. ఆదివారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయిన నేతలు జరుగుతున్న రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ. శ్రీనివాస్‌గౌడ్, కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్ రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, కోరుకంటి చందర్ తదిరులు పాల్గొన్నారు.