హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అప్రజాస్వామిక చర్యలు వెంటనే మానుకోవాలని గొల్లకురుమ హకుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మలాజిగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక రౌడీలా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
స్థానిక ప్రజానాయకుడు మండల రాధాకృష్ణ యాదవ్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ, యాదవులను బెదిరిస్తున్న మైనంపల్లికి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రౌడీయిజం, భూకబ్జాలు ప్రజలు సహించరని మండిపడ్డారు. నిరుడు మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఇలాగే పిచ్చి కూతలు కూశారని, గొప్ప నాయకులపైన దాడులకు దిగితే.. గొప్పవాళ్లమవుతాం అనుకుంటే అది ఎప్పుడు తప్పే అవుతుందని హితవు పలికారు. యాదవ కులాన్ని దూషిస్తే ఊరుకోబోమని.. ఖబడ్దార్ మైనంపల్లి అని హెచ్చరించారు.