నమస్తే నెట్వర్క్, మార్చి 17: అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేత చర్యగా సస్పెన్షన్ చేయ డం దుర్మార్గమని, ఇంకెన్నాళ్లీ నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. సస్పెన్షన్‌పై కేటీఆర్, జగదీశ్‌రెడ్డి నిరసన తెలిపితే కేసీఆర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నా యకులు దహనం చేయడం దారుణమని మండిపడ్డారు. దిష్టిబొమ్మల దహనానికి నిరసనగా సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కేసీఆర్, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశా రు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గవర్నర్‌తో అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడిం చి, వాటిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రజల ఆ లోచనను డైవర్ట్ చేసేందుకు సస్పెన్షన్లకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా ప్రజలతో కలిసి పో రాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. రామడుగులో బీఆర్ఎస్ నాయకులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రోడ్డుపై ధర్నా చేశారు. చొప్పదండిలోని తెలంగాణ చౌరస్తాలో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కలిసి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఏనుగు రవీందర్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అనంతరం నాయకులను అరెస్టు చేసి చొప్పదండి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అరెస్టు అయిన నాయకులను విడిపించారు.