KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు, గుంపు మీడియా విష ప్రచారం చేస్తుందంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై జరిగిన విచారణపై కాంగ్రెస్ నేతలు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
క్వాష్ పిటిషన్‌పై ఈ దశలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీం సూచన మేరకు వెంటనే కేటీఆర్ లీగల్ టీమ్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంది. అక్రమ కేసులను న్యాయబద్ధంగానే ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. క్వాష్ పిటిషన్ వేసే నాటికి ఎఫ్ఐఆర్ దశలోనే ఫార్ములా ఈ కార్ కేసు ఉంది. సుప్రీంలో విచారణకు ముందే ఏసీబీ విచారణకు కేటీఆర్ సహకరించారు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు విషయాలను న్యాయస్థానం దృష్టికి కేటీఆర్ లీగల్ టీమ్ తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు సూచన మేరకు కేటీఆర్ లాయర్లు పిటిషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, గుంపు మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. కేటీఆర్‌కు ఎదురుదెబ్బ అంటూ దిక్కుమాలిన వ్యాఖ్యానాలు చేస్తోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో తమ అప్పీల్‌ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెనక్కి తీసుకున్నారు. సోనియా, రాహుల్‌కు కూడా ఎదురుదెబ్బ తగిలినట్టేనా..? చరిత్రను కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు అని కేటీఆర్ అడ్వకేట్ మోహిత్ రావు స్పష్టం చేశారు. మా లీగల్ ఒపీనియర్ ప్రకారం కేసు విత్ డ్రా చేసుకున్నాం. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నవి ప్రొసీజర్‌లోని ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు. ఫార్ములా ఈ కార్ కేసు విషయమైన సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1ఏ సీపీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం అని మోహిత్ రావు పేర్కొన్నారు.
ప్రపంచం మొత్తంలో 9 నగరాల్లోనే ఫార్ములా ఈ రేసు జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు ఫార్ములా ఈ రేసును రప్పించి.. కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే ఫార్ములా ఈ రేసు నిర్వహించారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై బూటకపు కేసు పెట్టారు. కేటీఆర్ ఎప్పుడూ విచారణను వ్యతిరేకించలేదు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని కేటీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు. ఫార్ములా కేసులో క్రిమినల్ ఆధారాలు లేవని కోర్టు నమ్మింది. క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకోవడం వేరు.. కొట్టివేయడం వేరు. అబద్దాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సోనియా, రాహుల్‌లో నేషనల్ హెరాల్డ్ కేసు అప్పీల్‌ను విత్ డ్రా చేసుకున్న సందర్భం ఉంది. సుప్రీంకోర్టు చెప్పినందుకే కేటీఆర్ క్వాష్ పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు. మీడియా అనేది ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి. విచారణకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ చెప్పారని న్యాయవాది సోమ భరత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Harish rao | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి : హరీశ్ రావు
TG EAPCET | టీజీ ఎప్‌సెట్ తేదీలు ఖరారు.. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు