ఆదిలాబాద్: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి.. ముందు మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్న రూ.2500 ఇవ్వాలంటూ మహిళలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పండుగనూ సంతోషంగా జరుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు.
రూ.4 వేల పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, రూ.15 వేల రైతుబంధు, రైతు కులీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్ని పండుగలను సంతోషంగా జరుపుకునేవాళ్లమని చెప్పారు. మళ్లీ కేసీఆరే రావలని ముక్త కంఠంతో చెప్పారు.