BRS Party | మెదక్ : మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి 22,296 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు 19,477 ఓట్లు, బీజేపీ రఘునందన్ రావుకు 20,754 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ పూర్తయ్యే సరికి బీఆర్ఎస్ 1542 ఓట్ల లీడ్‌లో ఉంది.
వరంగల్‌లో కాంగ్రెస్ కడియం కావ్య, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి, మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్, ఆదిలాబాద్‌లో గోడం నగేశ్, ఖమ్మంలో కాంగ్రెస్ రఘురామిరెడ్డి, కరీంనగర్లో బండి సంజయ్, చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నల్లగొండలో కాంగ్రెస్ రఘువీర్ రెడ్డి, నిజామాబాద్‌లో అరవింద్, హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఒవైసీ లీడ్‌లో ఉన్నారు.