RS Praveen Kumar | హైదరాబాద్ : ఆసియా గేమ్స్‌లో కాంస్యం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని ఏం పాపం చేసింది..? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అథ్లెట్ అంటే చిన్న చూపు? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ఒక వైపు ప్రియాంక గాంధీ రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు అండగా ఉంటానని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నందిని లాంటి అథ్లెట్లను చిన్న చూపు చూడటాన్ని ఎలా చూడాలి? వెనకకు నెట్టివేయబడ్డ వర్గాలకు చెందిన అథ్లెట్ అనేనా ఈమెపై చిన్న చూపు..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
బాక్సర్ నికత్ జరీన్, క్రికెటర్ సిరాజ్, ఈషా సింగ్ లాంటి వాళ్లతో పోలిస్తే నందిని పతకాలు తక్కువేం కాదు. కేవలం సంక్షేమ పాఠశాలలో చదివిందని, తండ్రి నేటికీ రజక వృత్తిలో ఉన్నాడనే ఆమె విజయాలు కాంగ్రెస్ పాలకులకు తక్కువగా కనబడుతున్నాయా..? అని ప్రశ్నించారు. అందరి లాగానే తనకూ పారితోషికం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం కేటాయించమని సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలిసినా న్యాయం జరగలేదు!! రేపు ఆగస్టు 15 నాడు క్రీడాకారిణి నందినికి కూడా నగదు బహుమతి, ఇంటి స్థలం కేటాయించాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆసియా గేమ్స్ లో కాంస్యం సాధించిన అగసార నందిని ఏం పాపం చేసింది?
ఎందుకు కాంగ్రేసు ప్రభుత్వానికి ఈ అథ్లెట్ అంటే చిన్న చూపు? ఒక వైపు @priyankagandhi గారు రెజ్లర్ వినేష్ పోగట్ కు అండగా ఉంటా అంటున్నరు, మరోవైపు తెలంగాణలో @revanth_anumula గారు నందిని లాంటి అథ్లెట్లను చిన్న చూపు చూడటాన్ని… pic.twitter.com/EbvDgzPcv5— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 14, 2024
ఇవి కూడా చదవండి..
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలకు అవమానం.. బూతులు తిడుతున్న కండక్టర్
KA Paul | ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చాడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు