RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరోపించారు. తెంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పట్ల సంచలన ఆధారాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయటపెట్టారు.
2023వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6:20 గంటలకు, మేడిగడ్డ పిల్లర్ల వద్ద భారీ శబ్ధాలు వచ్చాయని మేడిగడ్డ అసిస్టెంట్ ఇంజనీర్ రవికాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు 2023 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్ ఫిర్యాదు చేశారు. ఇంతవరకు ఆ ఎఫ్ఐఆర్ పట్ల చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ఆర్ఎస్పీ నిలదీశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారు. ప్రాజెక్టు పిల్లర్‌కు పగుళ్లు రావు.. క్రస్ట్ గేట్లకు వస్తే రావొచ్చేమో. ఇంటి నిర్మాణానికి సంబంధించిన పిల్లర్లకు కూడా పగుళ్లు రావు.. ఉష్ణోగ్రత తేడాతో గోడలకు పగుళ్లు వస్తాయి కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కటే 20వ నెంబర్ పిల్లర్కి క్రాక్ వచ్చిందంటే, కచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయని ఆర్ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.
అసలు ఏమాత్రం వరద లేని సమయంలో మేడిగడ్డ బ్యారేజీ ఎలా కుంగిపోయింది.. అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుంది. 2022లో రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు తట్టుకున్నాయి. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మాత్రమే ఎందుకు కుంగిపోయింది. కిషన్ రెడ్డి లేఖ రాయగానే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఉత్తరాఖండ్‌లో మొత్తం డ్యామ్ కొట్టుకునిపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ అక్కడికు వెళ్ళలేదు. మేడిగడ్డ వద్ద పేలుళ్ల శబ్దాలపై ఎన్డీఎస్ఏ ఎందుకు మాట్లాడటంలేదు. మహదేవ్పూర్ పోలీసులు వెంటనే విచారణ చేసి ఉండాలి. అసాంఘిక శక్తులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇంకా ఎవరైనా అనేది తేల్చాలి. ఈ ముగ్గురి మొబైల్ ఫోన్స్ డేటా చెక్ చేస్తే వెంటనే దొరికేవాళ్ళు . భూపాలపల్లి పోలీసులు అప్పుడు వెంటనే పిల్లర్ల శాంపిల్స్, భూమి శాంపిల్, అక్కడ ఉండే మీటర్ రీడింగ్స్, సిస్మిక్ డేటా, కాల్ డీటెయిల్స్ తీసుకొని ఉండాల్సింది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
పిల్లర్లకు ఎక్కడా క్రాక్ రాదని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. దీని వెనుక రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారా లేదా అనేది సిట్ ఏర్పాటు చేసి తేల్చాలి. అసలు అక్కడ చిన్నస్థాయిలో ఏమైనా భూకంపాలు వచ్చాయా లేదా అనేది తేల్చాలి. పేలుళ్ల కోణంలో ఎందుకు విచారణ జరగలేదు. పేలుళ్లపై ఇప్పటివరకు ఎవరి స్టేట్మెంట్ రికార్డు చేయలేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
అధికారం కోసం అర్రులు చాచిన కాంగ్రెస్ – బీజేపీలు, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేసేందుకు ఎంత దిగజారినరో ఆధారాలతో బయటపెట్టిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
2023వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6:20 గంటలకు, మేడిగడ్డ పిల్లర్ల వద్ద భారీ శబ్ధాలు… pic.twitter.com/WWNJZEXMzS
— BRS Party (@BRSparty) August 16, 2025