RS Praveen Kumar | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ పాలన కన్నా దారుణంగా తయారైందని చెప్పడానికి నేటి సంక్షేమ గురుకులాల పనితీరు చూస్తే అర్థమైతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రతిభా పాఠశాలలకు (Centres of Excellence) ప్రవేశ పరీక్షను రద్దు చేయడం, కొన్ని ఒకేషనల్ కోర్సులు ఎత్తి వేయడం, వందలాది మంది పేద ఎస్సీ వర్గాలకు చెందిన ఉద్యోగులను కక్షగట్టి తీసివేయడం, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గౌలిదొడ్డి, అలుగునూరు ప్రతిభా పాఠశాల అడ్మిషన్లు గందరగోళంగా మారడం, సమ్మర్ కోచింగు క్యాంపులను పూర్తిగా ఎత్తివేయడం చూస్తుంటే రేవంత్ రెడ్డికి పేదలంటే ఎంత చులకన భావం ఉందో ఇట్టే తెలిసిపోతుందని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
తాము చేసిందే కరక్టు అని సమర్థించుకోవడానికి అధికారులతో రాజకీయ ఉపన్యాసాలు కూడా ఇప్పిస్తున్నారు మన సీఎం గారు! ఇంత జరుగుతున్నా ఏ ఒక్క ఎస్సీ-ఎస్టీ ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ నోరు మెదపకపోవడం మన దురదృష్టం. కేసీఆర్ పాలనలో అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలు కమిటీలుగా ఏర్పడి రెగ్యులర్గా విద్యా సంస్థల పనితీరును సమీక్షించే వారు. ఇప్పుడు ఆ సంప్రదాయం కనుమరుగైంది. సంక్షేమ రంగాలకు మంత్రులు లేరు! మళ్లీ మా బిడ్డలు బర్రెలు గొర్రెలే కాయడం, మళ్లీ ఇళ్లలో పాచి పనులు చేయడం లాంటివి మాత్రమే చేయాలన్న మాట అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.