RS Praveen Kumar | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలు తనను షాక్‌కు గురి చేశాయన్నారు ఆర్ఎస్పీ. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏడాది కాలం అయి ఉండొచ్చు. కానీ హరీశ్‌రావు సమయపాలన, ఓర్పు, స్నేహభావంతో పాటు ఆయన కృషి, ఆలోచన విధానాలపై తనకు అపారమైన అభిమానం ఏర్పడిందన్నారు. అధికార యంత్రాంగంలో కూడా చాలా మందికి ఈ లక్షణాలన్నీ లేవు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. అవినీతిమయమైన కాంగ్రెస్, బిజెపి కూటమి నుండి తెలంగాణను విముక్తి చేయడానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఇది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
Shocked by the allegations aimed at @BRSHarish garu yesterday.
I may be just one year old in @BRSparty but I have developed huge admiration for Mr. Harish Rao for his sense of punctuality, patience, camaraderie, hard work, integrity, elaborate preparation, and clinical…— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 2, 2025