RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల చేతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సర్‌ను వనస్థలిపురం ఏరియాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సర్ని పరామర్శించి వచ్చాను. ఆయన గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది. ఆయన డిమాండ్లు అసాధ్యమైనవి కానే కావు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలలో కనీసం ఈ దసరాకు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వమని కోరుతున్నాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకేమైనా ఫరవాలేదు తన పంతం నెగ్గాలి అన్న ధోరణిలో కొనసాగుతోంది. అశోక్ సర్‌ను గాంధీ హాస్పిటల్‌కు కాకుండా ఐసీయూ లేని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి బలవంతంగా తరలించడంలోనే ఈ కుట్ర అర్థం అవుతుంది. నిరుద్యోగుల చేతిలో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చివరకు ఆయన జై తెలంగాణ అని నినదించారు.
ఇప్పుడే వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సర్ గారిని పరామర్శించి వచ్చాను. ఆయన గత ఐదు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం లో ఏమాత్రం చలనం లేదు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది. ఆయన డిమాండ్లు అసాధ్యమైనవి కానే కావు.
కాంగ్రెస్ హామీ ఇచ్చిన… pic.twitter.com/Lk1HKU2LWl
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 19, 2025