RS Praveen Kumar | హైదరాబాద్ : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుకాల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
సభ్యత, సంస్కారం, మానవత్వం అంటే ఎంటో మీకు తెలియదు అని ధ్వజమెత్తారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే మీకు తెలుసు అని మండిపడ్డారు. ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు.. నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు మంత్రి గారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
కేటీఆర్ గురుకుల బాట అనగానే వెన్నులో చలి పుడుతోందా..? రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. దమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రండి. అంతే కాని మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండి అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీకు,
బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు,
ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన మీకు,
నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు, మంత్రి గారు.
రేవంత్… pic.twitter.com/fZd4wh9G5s
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 29, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కేసీఆర్ గురించి ఆసక్తికర విషయాలు.. దీక్షా దివస్లో కేటీఆర్ వెల్లడి
KCR | దీక్ష దివస్.. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు.. ఫొటో గ్యాలరీ