RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. మీది ప్రజా ప్రభుత్వం కాదు.. ముమ్మాటికీ ప్రతీకార ప్రభుత్వం అని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆర్ఎస్పీ తీవ్రంగా స్పందించారు.
బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత భయమైనప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని పాలన చేయవచ్చు కదా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. మీది ప్రజా ప్రభుత్వం కాదు ముమ్మాటికీ ప్రతీకార ప్రభుత్వం. మీ కాంగ్రెస్ పాలన చూసి తెలంగాణలో పెళ్లయిన జంటలు పిల్లలను కనడానికి కూడా జంకుతున్నరు. ఇప్పటికే కన్న బిడ్డలను మీ బడులకు పంపడానికి భయపడుతున్నరు అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
మీరు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా మా భావితరాల భవిష్యత్తును బొంద పెట్టి ‘ఆంధ్ర’ బీజేపీ కాంట్రాక్టర్ సీయం రమేష్ తో కలసి భవిష్యత్ నగరాన్ని నిర్మిస్తమంటున్నరు! కేవలం మీ నలుగురు అన్నదమ్ముల భవిష్యత్ బాగుంటే చాలా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.