RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో విద్యార్థి గురుకుల విద్యాలయం హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు. ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
విద్యాలయాల్లో కౌన్సిలర్ వ్యవస్థ ఉండి ఉంటే బహుశా ఈ బిడ్డకు చావు గురించి ఆలోచన వచ్చేది కాదు. భవిష్యత్‌ను భద్రంగా దాచుకునే ట్రంకు పెట్టెలు, బలవన్మరణాలకు సోపానాలుగా మారడం కాంగ్రెస్ దుష్ట పాలనకు తార్కాణం. కౌన్సిలర్లను నియమించమని సీఎం రేవంత్ రెడ్డికి గత సంవత్సరం నుంచి చెబుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని సీఎంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. నేటికి సంక్షేమ విద్యాలయాల్లో దాదాపుగా 55 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంతమందిని బలి తీసుకుంటారు..? అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్పీ సూటిగా ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Leopard | దిలావర్పూర్లో చిరుత సంచారం.. భయాందోళనల్లో ప్రజలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీసు నోటీసులు
KTR | కాంగ్రెస్ అంటేనే మహనీయులను అవమానించడం.. రాహుల్ పర్యటనపై కేటీఆర్ ఫైర్