Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ నేత శేఖర్‌పై రోటిబండ తండావాసులు దాడి చేసిన ఘటనలో జనవరి 2న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇప్పటికే రోటిబండ తండా ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడి బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్‌పై ఉండి కూడా షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని బొంరాస్‌పేట పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎల్లుండి విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు.