Leopard | దిలావర్పూర్లో చిరుత సంచారం.. భయాందోళనల్లో ప్రజలు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిరుతపులి కనిపించింది.
నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిరుతపులి కనిపించింది. దీంతో తమ సెల్ఫోన్లలో చిరుతను బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కాగా, చిరుత సంచారంతో సమీపంలోని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌ను వణికిస్తున్న పులులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులులు వణికిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్-మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గతంలో ఉన్న రెండు పులులు కాస్తా.. 11కు పెరగడంతో ఇదిగో పులి.. అదిగో టైగర్ అన్న హెచ్చరికలతో స్థానికులు జంకుతున్నారు. పులుల భయంతో రోజువారీ పనులకు వెళ్లేందుకు అటవీ సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. తాజాగా ఎర్రగుంట గ్రామశివారులో అటవీ అధికారులు పులి కదలికలను గుర్తించారు.
మంచిర్యాల జిల్లా ముల్కల్లబీట్ పరిధిలోనూ మరో ఆడపులి సంచారాన్ని కనిపెట్టారు. ఇక్కడే మరో ఆడపులి ట్రాప్‌కెమెరాకు చిక్కింది. ఇదే ఏరియాలో మరో మగపులి సంచరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మందమర్రి, అందుగులపేట, తాండూరు మండలం నీలాయిపల్లి సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. బొంబాయిగూడ గ్రామ శివారులోని ఉచ్చమల్లవాగుతోపాటు సమీప పంటచేలల్లో మేకలకాపరులు పులి పాదముద్రలను చూసినట్టు తెలిపారు. పులల సంచారంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు గ్రామాల్లో చాటింపు వేయిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

