RS Praveen Kumar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్పై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బాబా ఫసీయుద్దీన్పై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్పీ పోలీసులను డిమాండ్ చేశారు.
బెదిరింపులకు పాల్పడి, సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసి గొల్పి, బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేదు? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. 5 నెలలు గడిచినా కేసులో పురోగతి ఎందుకు లేదు? పైగా అతనికే గన్మెన్లను ఇచ్చి స్టార్ క్యాంపెయినర్ను చేసి మంత్రుల వెంట తిప్పుతున్నారు అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఒక న్యాయం.. ఇతరులకు మరొక న్యాయమా..? అని ఎన్నికల సంఘాన్ని, హైదరాబాద్ సీపీని ప్రశ్నించారు. వెంటనే ఈ బాబాను అరెస్ట్ చేసి, రౌడీషిట్ ఓపెన్ చేసి జైలుకు పంపాలి. లేదంటే బోరబండలో ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
బెదిరింపులకు పాల్పడి,సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా ఉసి గొల్పి,బహిరంగంగా అందరినీ బెదిరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్ ను పోలీసులు ఎందుకు బైండోవర్ చేయడం లేదు?
5 నెలలు గడిచినా కేసులో పురోగతి ఎందుకు లేదు? పైగా అతనికే గన్ మెన్లను… pic.twitter.com/QVnjMW8Ypo
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) November 1, 2025