RSP | హైదారబాద్ : కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కన్నెర్ర జేశారు. పలు ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న పార్ట్ టైమ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి జీతాలు రాక అవస్థలు పడుతున్నారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు.
గత ఐదు నెలల నుండి సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న పార్ట్ టైం ఉద్యోగస్తులకు జీతాలు రాలేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా రాలేదని ధ్వజమెత్తారు. ఈ దసరాకు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి?బంధువులు ఇంటికొస్తే ఏం పెట్టాలె వాళ్లకు? అని సర్కార్‌ను ఆర్ఎస్పీ నిలదీశారు.
కేవలం మీరు, మీ దగ్గరున్న బడా కాంట్రాక్టర్లు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు తీసుకొని ఆనందంగా ఉంటే చాలా సీఎం రేవంత్ రెడ్డి గారు? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.