తుగ్లక్ పాలనను తలపిస్తున్న రేవంత్ నిర్ణయాలు
రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ అధ్వానంగా తయారైందని, సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- 27 వేల బడులను 4 వేలకు కుదిస్తామన్న ప్రకటనను ఉపసంహరించుకోవాలి
- బీఆర్ఎస్ నేత రావుల ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో విద్యాశాఖ నిర్వహణ అధ్వానంగా తయారైందని, సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తుగ్లక్ పాలనను తలపిస్తున్నాయని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవైపు విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని గొప్పలు చెప్తూనే, మరోవైపు రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదిస్తామని చెప్పడం ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అసలు స్కూళ్ల నిర్వహణ ఎలా ఉండాలో రేవంత్‌రెడ్డికి కనీస అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. విద్యాహకు చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్న సూళ్ల కుదింపు ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వ విద్యకు బడ్జెట్లో పెట్టే ఖర్చు వృథాగా కాకుండా భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడిగా భావించాలి.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది’ అని ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలతోనే విద్యా కమిషన్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారని, ఈ ఒక ఘటనతోనే రేవంత్ సరార్ తీరు ఎంత దారుణంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. విద్యావేత్తలతో కనీసం చర్చలు జరుపకుండానే స్కూళ్లను కుదిస్థామని ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. ఉన్న సూళ్లను పట్టించుకోలేని ప్రభుత్వం.. కొత్త బడులు పెడుతామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ విద్యను ఎంతగానో బలోపేతం చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్కూళ్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించడంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేశామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

