స్పీకర్ వ్యాఖ్యలు రెండు సార్లు తొలగింపు
యూపీలోని డోమరియాగంజ్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ లోక్‌సభలో ఓ అరుదైన రికార్డు సృష్టించారు. స్పీకర్ చైర్లో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలను రెండుసార్లు లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించడంతో ఇలా జరిగిన మొదటి ప్రిసైడింగ్ అధికారిగా నిలిచారు.
- ప్యానల్ స్పీకర్‌గా వివాదాస్పద వ్యాఖ్యలు
- బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ అరుదైన రికార్డు
న్యూఢిల్లీ : యూపీలోని డోమరియాగంజ్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ లోక్‌సభలో ఓ అరుదైన రికార్డు సృష్టించారు. స్పీకర్ చైర్లో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలను రెండుసార్లు లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించడంతో ఇలా జరిగిన మొదటి ప్రిసైడింగ్ అధికారిగా నిలిచారు. గతంలో ఆయన ఒక్కరోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడానెలకొల్పారు.
గత బుధవారం ఆయన ప్రిసైడింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో రాబటర్స్ గంజ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఛోటేలాల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. దీంతో స్పీకర్ ఓంబిర్లా జగదాంబికా పాల్ వ్యాఖ్యలను తర్వాత రికార్డుల నుంచి తొలగించారు. అంతకుముందు ఆగస్టు 5న కూడా స్పీకర్ కుర్చీలో ఉండి ఎస్పీ ఎంపీ రుచి వీరా, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌పై పాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వీటిని కూడా తర్వాత స్పీకర్ తొలగించారు. ఇలా జరిగిన మొదటి ప్రిసైడింగ్ అధికారిగా పాల్ నిలిచిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

