హైదరాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగా ణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల హామీలు ఉత్తుత్తిమాటలే అయ్యాయి. 20 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు’ అని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడా రు. ఏటా 4 లక్షల ఇండ్లను కట్టిస్తామని చెప్పి న కాంగ్రెస్ సర్కారు.. ఆ దిశగా చర్యలు చేపట్టడమే లేదని విమర్శించారు. కేసీఆర్ కట్టిన ఇండ్లనే ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు లబ్ధిదారులకు ఇస్తున్నారని తెలిపారు.
కొన్నిచోట్ల ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. రేషన్‌కార్డుల జారీ విషయంలో సర్కారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని, కేసీఆర్ సర్కారు హయాంలో 6.47 లక్షల రేషన్‌కార్డులు ఇచ్చారని వివరించారు. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల వల్ల నగర ప్రజలంతా అనేక ఇ బ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. మున్సిపల్ శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. విద్య, హోం శాఖ మంత్రిగా కూడా ఆయన వైఫల్యం చెందారని దుయ్యబట్టారు. హైడ్రా, జీహెచ్ఎంసీ మధ్య సమన్వయం కొరవడిందని తెలిపారు.