నాంపల్లి కోర్టులు, మే 10 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) సర్క్యులర్‌కు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ మేరకు నాంపల్లిలోని 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.25 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తును సమర్పించాలని, నెలరోజులపాటు రోజూ 12 గంటల్లోగా ఓయూ పోలీసు స్టేషన్‌కు హాజరై సంతకం చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఇందుకు సంబంధించిన ప్రతులు చంచల్‌గూడ జైలు అధికారులకు అందిన వెంటనే క్రిశాంక్ విడుదల కానున్నారు. సోమవారం జరగనున్న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో క్రిశాంక్‌కు బెయిల్ లభించడంపై బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.