Harish Rao | రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
సో కాల్డ్ ప్రజాపాలనలో నాయకులు, జర్నలిస్టులపై దాడులు చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నించే గళాలను రేవంత్ సర్కారు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.
తిరుమలగిరి పట్టణంలో దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని హరీశ్‌రావు కోరారు. కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక, రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేసే దాకా పోరాటం కొనసాగిమని తెలిపారు. ఎక్కడిక్కడ నిలదీస్తామని చెప్పారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం… pic.twitter.com/32URohW7Sj
— Harish Rao Thanneeru (@BRSHarish) August 22, 2024