Harish Rao | జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన విప్లవ యోధుడు కొమురం భీమ్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కొనియాడారు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొమురం భీమ్ గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలిసేలా పోరుగడ్డ జోడేఘాట్‌ను గొప్ప స్మారక క్షేత్రంగా అభివృద్ధి చేశారని హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున కొమురం భీమ్ స్మారక భవనాన్ని నిర్మించి ఆదివాసుల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలిపారని అన్నారు. వారి పోరాట చరిత్ర నిత్య స్ఫూర్తి, కొమురం భీమ్ ఆశయ సాధనకు ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.