Harish Rao | గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతుల సాధనలో విఫలమవ్వడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో జరుగుతున్న జాప్యం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం వల్ల తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు హరించబడతాయని హరీశ్‌రావు అన్నారు. విభజన చట్టం ప్రకారం గోదావరి-కృష్ణా బోర్డుల అనుమతులు తప్పనిసరిగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడం చట్ట ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రాజెక్టుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రెండు లేఖలు రాయడం పట్ల హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రణాళికల అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండటం శోచనీయమని అన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు TAC అనుమతి రావడానికి కేంద్రం 6 నెలలుగా జాప్యం చేస్తోందని తెలిపారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్ NOC జారీపై కేంద్రం జోక్యం అవసరమని అభిప్రాయపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. మిషన్ కాకతీయ, చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌ల ద్వారా సాగునీటి అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. వరద జలాల వినియోగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదనపు 1 టీఎంసీ నీరు ఎత్తిపోసే ప్రణాళికకు అనుమతులు ఇంకా లభించలేదని అన్నారు.
గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతుల సాధనలో విఫలమవ్వడంతో ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తక్షణ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే చర్యలు చేపట్టడంలో కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరారు.
Harish Rao1
Harish Rao2
Harish Rao3
Harish Rao4